Header Banner

ప్రయాణికులకు గుడ్‌న్యూస్! తత్కాల్ టికెట్ల కోసం న్యూ వెర్సన్ రెడీ.. రైల్వే శాఖ కీలక నిర్ణయం!

  Fri Apr 11, 2025 20:41        Travel

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ విధానం లో మార్పులు తెచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే తత్కాల్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. తత్కాల్ టికెట్ బుకింగ్.. సమయాలు.. క్యాన్సిలేషన్ వంటి వాటిల్లో మార్పులు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. చెల్లింపు విధానంలోనూ మార్పులు చేసింది. తత్కాల్ విధానం మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు మార్పులు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. తత్కాల్ మార్పులు

తత్కాల్ టికెట్ విధానంలో రైల్వే కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. తత్కాల్ టికెట్ ముందు రోజు పొందేలా రైల్వే కొనసాగిస్తోంది. ఇందు కోసం కేటగిరీల ఆధారంగా సమయాలు అమలు చేస్తోంది. కాగా, వస్తున్న ఫిర్యాదులు.. ప్రయాణీకు ల నుంచి వస్తున్న సూచనల అనుగుణంగా కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి తత్కాల్ లో ఏసీ క్లాస్ టికెట్ల బుకింగ్ - ఉదయం 11:00 గంటలకి ప్రారంభం కానుంది. అదే విధంగా నాన్-ఏసీ / స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్ - మధ్యాహ్నం 12:00 గంటలకి అందుబాటులోకి వస్తుంది. ఇక, ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ - ఉదయం 10:30 గంటలకి మొదలవుతుంది.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


ఇదీ విధానం
ముందు రోజే తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రయాణం చేసే రైలు.. తరగతిని ఎంపిక చేసుకోవాలి. కోటా నుంచి 'తత్కాల్'ను సెలెక్ట్ చేయాలి. అక్కడ కోరిన విధంగా ప్రయాణికుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత.. చెల్లింపు చేసి టికెట్ బుక్ చేసుకొనేలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజా మార్పుల ప్రకారం ప్రయాణికుల వివరాలు ముందుగానే భర్తీ చేసే ఆప్షన్‌ అందుబాటులోకి వస్తుంది.

ఇక నుంచి ఇలా
ఇక నుంచి చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెంచుతూ నిర్ణయించారు. ఇక, కాప్చా వేరిఫికేషన్ సిస్టమ్ మరింత సరళీకరణ చేసారు. వెబ్‌సైట్, యాప్‌ రెండింటికీ ఒకే విధమైన లాగిన్ విధానం కల్పించారు. అయితే, ఒక PNR కింద గరిష్టంగా నలుగురు ప్రయాణికులకు మాత్రమే టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పడు అమల్లో ఉన్న విధంగానే తత్కాల్ కోటాలో ఎటువంటి రాయితీలు వర్తించవు. ప్రయాణ సమయంలో ఐడీ ప్రూఫ్ తప్పనిసరి. తాజా మార్పుల తో ప్రయాణీకులు తత్కాల్ టికెట్ సులభంగా పొందే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TatkalTickets #IRCTCUpdate #RailwayNews #GoodNewsPassengers #TatkalBooking